లాంచ్ అయిన‌ సావిత్రి 'మ‌హాన‌టి'

Mon,May 29, 2017 01:02 PM
MAHANATI movie launched today

భారతదేశం గర్వించదగ్గ నటీనటులలో మహానటి సావిత్రి ఒకరు. ఆ మహానటిపై బయోపిక్ తీయాలని నాగ్ అశ్విన్ భావించడం గొప్ప ప్రయత్నమే. కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి అనేక వార్త‌లు వ‌చ్చాయి. ఈ సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుంది అని అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూశారు. తాజాగా ఈ మ‌హ‌న‌టి సినిమా రామ‌కృష్ణ స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. తొలి షాట్ ని లెజండ‌రీ యాక్ట‌ర్స్ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, సావిత్రి ఫోటోల‌పై తీసారు. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నారు. తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనుండగా, జమునగా అనుష్క నటించనుందని అంటున్నారు. ఇక సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుంది. సావిత్రి జీవితంలో కీలకమైన వ్యక్తి జెమినీ గణేశన్. ఆ పాత్రను మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్ చేయనుండగా, విజయ్ దేవరకొండ ..సమంతకి భర్తగా కనిపించనున్నట్టు సమాచారం. ఇక సీనియర్ నటి భానుప్రియ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్ర పోషించనుందని, ప్రస్తుతానికి ఆ పాత్ర వివరాలు సీక్రెట్ అంటున్నాడు నాగ్ అశ్విన్. సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడట. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.


2110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles