ఏడాది పూర్తి చేసుకున్న మ‌హాన‌టి.. స్పెష‌ల్ వీడియో విడుద‌ల‌

Fri,May 10, 2019 08:36 AM

తెలుగులో తొలి బ‌యోపిక్‌గా రూపొంది సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం మ‌హాన‌టి. అభిన‌వ నేత్రి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, రాజేంద్ర ప్ర‌సాద్ ,షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. మిక్కీ జే మేయ‌ర్ చిత్రానికి సంగీతం అందించారు. వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌పై ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్నా ద‌త్ నిర్మాణంలో ఈ మూవీ రూపొందింది. మ‌హిళ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ విజ‌యం సాధించి ఔరా అనిపించింది. మే 9,2018న విడుద‌లైన మ‌హాన‌టి చిత్రం మే9,2019తో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో ప‌లువురు ప్రముఖులు చిత్రంపై ప్ర‌శంస‌ల వర్షం కురిపించారు.


మ‌హాన‌టి చిత్రం ఎన్నో ఘ‌న‌త‌లు సాధించింది. ఐఎండీబీలో స్థానం సంపాదించిన ఈ చిత్రాన్ని 49వ‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉత్స‌వాలలో ప్ర‌ద‌ర్శించారు . చైనాలోని షాంగై లో జూన్ 15నుండి 24 వరకు 22వ షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుండ‌గా, ఇందులో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. షాంగైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న తొలి ఇండియ‌న్ సినిమాగా మ‌హాన‌టి అరుదైన ఘ‌న‌త సాధించింది. ప‌లు ఘ‌న‌త‌లు సాధించిన ఈ చిత్రంలో సావిత్రి జీవితంలోని ఎత్తు ప‌ల్లాల‌ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌డం చాలా గ‌ర్వంగా ఉంద‌ని కీర్తి సురేష్ తెలిపింది. త‌న‌తో ప‌ని చేసిన వారంద‌రికి కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేసింది కీర్తి.
1406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles