టాప్ టెన్‌లో మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం చిత్రాలు

Thu,December 13, 2018 01:48 PM
mahanati and rangasthalam in top 10 as per imdb survey

సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వీడియో గేమ్స్ , తదితర వర్గాలకి సంబంధించిన ఆన్ లైన్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మేనేజ్ మెంట్ డాటాబేస్ ) తాజాగా 2018కి గాను ఇండియాలో టాప్ టెన్ మూవీస్ లిస్ట్ విడుద‌ల చేసింది . ఇందులో టాలీవుడ్ నుండి మహానటి (4), రంగస్థలం(7) స్థానాల్లో చోటు సంపాందించాయి. మ‌హాన‌టి చిత్రం అభిన‌వ నేత్రి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా ఇందులో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించారు. స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్, విజ‌య్ దేవ‌ర‌కొండ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించారు. మేలో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డ‌మే కాక ఇండియన్‌ పనోరమ లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఎంపికైన సినిమాగా నిలిచింది.

ఇక లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం చిత్రం ఎంత భారీ విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాహుబలి తరువాత అత్యదిక వసూళ్లను సాధించిన రెండవ చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ చిత్రం. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అన‌సూయ‌, ప్ర‌కాశ్ రాజ్,జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు.

ఐఎండిబి 2018 టాప్ 10 లో చోటు సంపాదించిన చిత్రాలు :

1. అంధాదున్ (హిందీ )

2. రట్సాసన్ (తమిళం )

3. 96 (తమిళం )

4. మహానటి (తెలుగు)

5. బడాయి హో (హిందీ)

6. ప్యాడ్ మ్యాన్ (హిందీ)

7. రంగస్థలం (తెలుగు)

8. స్ట్రీ (హిందీ)

9. రాజీ (హిందీ)

10. సంజు (హిందీ)

3406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles