‘మహానటి’ సర్‌ ప్రైజ్ ఇదే..!

Wed,December 6, 2017 06:07 PM
‘మహానటి’ సర్‌ ప్రైజ్ ఇదే..!

కొందరు నటనను సాధన చేసి నేర్చుకుంటారు. కానీ అభినయం సహజసిద్ధంగా రావాలే కానీ నేర్చుకుంటే వచ్చేది కాదని మరికొందరు అంటారు. జీవితాన్ని నటనకే అంకితం చేసిన ఎందరో మహానటీనటులున్నారు. అలాంటి మహానటి సావిత్రి. ఆమెను నటనకు ప్రతిరూపం అనవచ్చు. నిజానికి ఆమె నటన .. భావితరాలకు స్ఫూర్తినిచ్చే ఒక పాఠశాల. కంటి చూపుతో కోటి భావాల్ని పలికించడమంటే మాటలు కాదు. ఆ సామర్థ్యం తనకొక్కదానికే ఉందని మహానటి సావిత్రి ఎన్నో పాత్రల్లో నిరూపించింది. ఈ రోజు ఆమె జయంతి.

సావిత్రి నవ్వు సమ్మోహితం. ఆమె అందం అతి సుందరం. అభినయం అనితరసాధ్యం. సునయన మనోహరంగా సావిత్రి తెరపై కనిపిస్తే ఆనాడు . .. నేడు కూడా లక్షలాది నట కళాభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. అందుకేనేమో ఈ నాడు ఆ మహానటి జీవిత నేపధ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్‌, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు ప్రధాన పాత్రలలో మహానటి తెరకెక్కుతుంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ మూవీకి సంబంధించిన స్మాల్ సర్‌ ప్రైజ్ కొద్ది సేపటి క్రితమే రివీల్ చేశారు. మహానటి లోగోతో పాటు చిత్ర రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.అంతేకాదు మార్చి 29,2018న మూవీ విడుదల కానుందని ప్రకటించారు.

2585

More News

VIRAL NEWS