47 వేల 3డీ స్క్రీన్స్‌లో 2.0 చిత్రం విడుద‌ల‌

Wed,August 14, 2019 08:57 AM
Magnum Opus 2Point0 to release in China on Sep 6

టెక్ మాంత్రికుడు శంక‌ర్ తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ 2.0 చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులోని గ్రాఫిక్ విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని క‌లిగించాయి. ఈ చిత్రాన్ని చైనాలోను విడుద‌ల చేయ‌నున్నారంటూ కొన్నాళ్ళుగా వార్త‌లు వినిప‌స్తూనే ఉన్నాయి. జూలై 12న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు హెచ్ వై మీడియా అనే డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ గ‌తంలో ప్ర‌క‌టించింది. కాని డిస్నీసంస్థ నుండి వ‌చ్చిన ద ల‌య‌న్ కింగ్ అనే చిత్రం హై విజువల్స్ తో జులై 19న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ నేప‌థ్యంలో 2.0 చిత్రాన్ని వాయిదా వేసారు. తాజాగా కొత్త డేట్ అనౌన్స్ చేశారు. 3డీలో 47 వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 6న‌ విడుద‌ల కానుండ‌గా, ఓ విదేశీయ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ఇంత భారీ సంఖ్య‌లో విడుద‌ల కావ‌డం ఇదే తొలిసారి. చైనాలో ఈ చిత్రం 'బాలీవుడ్ రోబో 2.0: రిస‌ర్జెన్స్' అనే టైటిల్‌తో విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. గ‌తంలో చైనాలో విడుద‌లైన బాహుబ‌లి 2 చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించిన సంగ‌తి తెలిసిందే. 2.0 చిత్రాన్ని 10 వేల థియేట‌ర్స్ ( 56 వేల స్క్రీన్స్‌లో ) విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు లైకా గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే .

1285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles