మగధీర కాపీ విషయంలో మరో ట్విస్ట్

Fri,June 2, 2017 02:04 PM
Magadheera controversy takes a new twist

రామ్ చరణ్‌, కాజల్ ప్రధాన పాత్రలో తెరక్కిన చిత్రం మగధీర. గీతా ఆర్ట్స్ బేనరలో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి సృష్టించింది. ఇటీవల ఈ చిత్రాన్ని బాలీవుడ్ మూవీ రాబ్తా యూనిట్ కాపీ కొట్టిందని, ఈ క్రమంలో నిర్మాణ సంస్థ కోర్టు మెట్లెక్కింద‌ని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే తెలుగు మగధీర కూడా కాపీ అంటూ ప్రముఖ నవలా రచయిత ఎస్ పి చారి పెద్ద బాంబ్ వేశారు. 1998లో తాను రాసిన చందేరి అనే నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారని ఆయన అంటున్నారు.

మధ్య ప్రదేశ్ లోని ఆర్చా రాజ్యానికి చెందిన ఇద్దరు ప్రేమికులు బావిలో దూకి ఆత్యహత్య చేసుకుంటారు. 400 ఏళ్ళ తర్వాత వీరు మళ్ళీ జన్మించి వివాహం చేసుకుంటారు. తన నవలలో ప్రేమికుల పేర్లకి హరదాల్, ఇందుమతి అని పెట్టగా సినిమాలో వాటిని మార్చి హర్ష, ఇందుగా పెట్టారని ఎస్ పి చారి వాదన. ఇక నవలలో విలన్ హీరోకి సోదరుడు కాగా, సినిమాలో హీరోయిన్ కి బావగా చూపించారు, ఇదీ తప్ప మిగతా అంతా సేమ్ అంటూ రచయిత ఆరోపిస్తున్నాడు. దీనిపై ఫిలిం ఛాంబర్ లో కేసు వేసిన ఎవరు పట్టించుకోలేదని, కాపీ రైట్ యాక్ట్ కింద కోర్టు ఎక్కుతానని రచయిత అంటున్నాడు. రానున్న రోజుల‌లో ఈ కేసులో ఇంకెన్ని ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయో చూడాలి మ‌రి.

2109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles