ఎప్పుడు వివాదాలలో ఉంటూ హాట్ టాపిక్‌గా నిలిచే కోలీవుడ్ హీరో శింబు. టి. రాజేందర్ కుమారుడైన శింబు ‘అన్బనవన్ అసరధవన్ అదంగధవన్’ (ఏఏఏ)’షూటింగ్ కు సరిగ్గా హాజరుకాలేదని ఆఖరికి డబ్బింగ్ కూడా బాత్రూంలో నుంచి చెప్పి పంపాడని నిర్మాత మైకేల్ రాయప్పన్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకి రూ.20 కోట్లు పరిహారంగా ఇప్పించాలని కూడా డిమాండ్ చేశాడు. అయితే ఆ తర్వాత అరాసన్ చిత్రంలో నటించేందుకు అడ్వాన్స్ తీసుకున్న శింబు ....ఆ సినిమాలో నటించకపోగా డబ్బులు తిరిగివ్వలేదని మరో నిర్మాత కోర్టుకెక్కారు. ఈ కేసులో తాజాగా శింబుకు మద్రాసు హైకోర్టు అక్షింతలు వేసింది.
అరాసన్ చిత్రంలో నటించేందుకు 2013 జూన్ 17న శింబు..నిర్మాత నుండి 50 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడని ఫ్యాషన్ మూవీ మేకర్స్ ఆరోపించింది. చిత్ర షూటింగ్లో పాల్గొనకపోగా, తీసుకున్న డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్ట్‌ని ఆశ్రయించారు. ఇలా చేసినందుకు శింబుపై మండి పడ్డ మద్రాస్ హైకోర్టు అడ్వాన్స్‌ని వడ్డీతో సహౄ చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ శింబు డబ్బు చెల్లించని పక్షంలో ఇల్లు - ఇతర ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. తాజా తీర్పుపై శింబు ఏం స్పందిస్తాడో చూడాలి.