రేణుక సహానేతో మాధురీ డ్యాన్స్..వీడియో

Sun,May 20, 2018 01:22 PM
Madhuri Dixit dance gone viral online


ముంబై: బాలీవుడ్ అందాల నటి మాధురీదీక్షిత్ డ్యాన్స్ చేసిందంటే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఐదు పదుల వయసులోనూ తన డ్యాన్స్ ఫర్‌ఫార్మెన్స్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది మాధురీ. రేణుక సహానే, మాధురీ 1994లో వచ్చిన ‘
హమ్ ఆప్కే హై కౌన్’ చిత్రంలోని సీన్ ను మరోసారి రిపీట్ చేశారు ఈ ఇద్దరు తారలు. మాధురీ తాజాగా బకెట్ లిస్ట్ అనే మరాఠీ డెబ్యూట్ మూవీ చేస్తుంది.

ఈ సినిమా సెట్స్‌లో మాధురీ తన కోస్టార్ రేణుక సహానేతో కలిసి డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన హమ్ ఆప్కే హై కౌన్ చిత్రంలోని ‘లో చలి మై’ సాంగ్‌కు మాధురి తనదైన ైస్టెల్‌లో స్టెప్పులేసి అదరగొట్టేసింది. మాధురీ దీక్షిత్ బకెట్ లిస్ట్ సెట్స్‌లో చేసిన డ్యాన్స్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. హమ్ ఆప్కే హై కౌన్ స్టార్లు ఇద్దరు చేసిన డ్యాన్స్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరీ..4351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles