శాస్త్రవేత్త‌గా మాధ‌వ‌న్‌..!

Sat,July 21, 2018 12:01 PM
Madhavan to played a role in scientist

కెరీర్‌లో విభిన్న పాత్ర‌లని పోషిస్తూ అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని స్థానం సంపాదించుకున్న న‌టుడు మాధ‌వ‌న్‌. కేవ‌లం ప్ర‌ధాన పాత్ర‌ల‌లోనే కాకుండా స‌పోర్టింగ్ రోల్స్‌లోను న‌టిస్తూ మెప్పిస్తున్నాడు. తెలుగులో ఇటీవ‌ల స‌వ్య‌సాచి అనే చిత్రాన్ని చేసాడు. ఇందులో మాధ‌వ‌న్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంద‌ని అన్నారు. అయితే ప్ర‌స్తుతం ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ బ‌యోపిక్‌లో న‌టించేందుకు మాధ‌వ‌న్ ఆస‌క్తిగా ఉన్నార‌ట‌. త‌మిళ ద‌ర్శ‌కుడు అనంత మ‌హ‌దేవ‌న్ కొన్నాళ్లుగా నంబి నారాయ‌ణ‌న్ బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌కి ఎవ‌రిని తీసుకోవాలా అని ఆలోచ‌న‌లు చేస్తూ వ‌చ్చాడు. చివ‌రికి మాధ‌వ‌న్ అయితే సరిగ్గా స‌రిపోతుంద‌ని భావించార‌ట‌. నంబి నారాయ‌ణ్ జీవితంలోని మూడు ప్ర‌ధాన కోణాల‌ని బ‌యోపిక్‌లో చూపించనున్న‌ట్టు స‌మాచారం. అంటే చిత్రంలో మూడు విభిన్న పాత్ర‌ల‌లో మాధ‌వ‌న్ క‌నిపించ‌నున్నాడ‌న్న‌మాట‌. వ‌చ్చే ఏడాది మొద‌ట్లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణులు, న‌టీన‌టుల వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌నున్నారు.

1161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS