శాస్త్ర‌వేత్త‌గా ఒదిగిపోయిన మాధ‌వ‌న్

Tue,January 22, 2019 02:01 PM

కెరీర్‌లో విభిన్న పాత్ర‌లని పోషిస్తూ అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని స్థానం సంపాదించుకున్న న‌టుడు మాధ‌వ‌న్‌. కేవ‌లం ప్ర‌ధాన పాత్ర‌ల‌లోనే కాకుండా స‌పోర్టింగ్ రోల్స్‌లోను న‌టిస్తూ మెప్పిస్తున్నాడు. తెలుగులో ఇటీవ‌ల స‌వ్య‌సాచి అనే చిత్రాన్ని చేసాడు. ఇందులో మాధ‌వ‌న్ పాత్ర వైవిధ్యంగా సాగింది. ఇక‌ ప్ర‌స్తుతం ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాడు మాధ‌వ‌న్. ఈ చిత్రాన్ని స్వ‌యంగా తెర‌కెక్కిస్తూ న‌టిస్తున్నాడు మాడి. రాకెట్రీ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంకి సంబంధించిన ఫైన‌ల్ లుక్ రివీల్ చేశాడు మాధ‌వ‌న్. 14 గంట‌ల త‌ర్వాత పూర్తిగా మారిపోయిన నేను నంబినారాయ‌ణ‌న్ లుక్‌లోకి పూర్తిగా ఒదిగిపోయాను. ఒరిజిన‌ల్ ఎవ‌రో డూప్లికేట్ ఎవ‌రో గుర్తుప‌ట్టలేకున్నంత‌గా మారిపోయాను అని మాధ‌వ‌న్ స్ప‌ష్టం చేశాడు. నంబి నారాయ‌ణ్ జీవితంలోని మూడు ప్ర‌ధాన కోణాల‌ని బ‌యోపిక్‌లో చూపించనున్న‌ట్టు స‌మాచారం. అంటే చిత్రంలో మూడు విభిన్న పాత్ర‌ల‌లో మాధ‌వ‌న్ క‌నిపించ‌నున్నాడ‌న్న‌మాట‌.2194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles