కొత్త లుక్‌లో మాధ‌వ‌న్‌.. వైర‌ల్ అవుతున్న ఫోటోలు

Tue,June 26, 2018 11:19 AM

తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేయ‌క‌పోయిన డ‌బ్బింగ్ సినిమాల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి మాధ‌వ‌న్ చాలా సుప‌రిచితం. ఈయ‌న‌కి తెలుగులో లెక్క‌లేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే త్వ‌ర‌లో ఓ స్ట్రైట్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు మాధ‌వ‌న్‌. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రంలో మాధ‌వ‌న్ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర పోషించాడు. ఈ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని టీం చెబుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. జోరో అనే బాలీవుడ్ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించాడు మాధ‌వన్. ఇప్పుడు క‌ల్కీ ఫేం దిలీప్ ద‌ర్శ‌క‌త్వంలో మారా అనే రొమాంటిక్ డ్రామా చేయ‌నున్నాడు . శ్ర‌ద్ధా శ్రీనాథ్ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే మాడీ తాజాగా మారా సినిమా కోసం చేసిన టెస్ట్ లుక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సాల్ట్ పెప్ప‌ర్ లుక్‌లో మాధ‌వ‌న్ ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాడు.

2402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles