ధనుష్ ఎందుకు అలా చేస్తున్నారో ..!

Wed,February 3, 2016 06:45 PM

తమిళ స్టార్ హీరో ధనుష్ ఓ పెద్ద సాహసమే చేయబోతున్నారు. ఈ సాహసానికి పలువురు అభినందనలు తెలుపుతున్నా, కొందరు అభిమానులు మాత్రం హై టెన్షన్‌లో ఉన్నట్టు అర్ధమవుతోంది. మరి అందుకు కారణమేమంటే పరాజయం పాలైన సినిమాకు సీక్వెల్ చేయాలని ధనుష్ అనుకోవడమే.


ధనుష్ ఇటీవల బాలాజీ మోహన్ దర్శకత్వంలో మారి అనే చిత్రాన్ని చేయగా, ఈ చిత్రం అభిమానులను మరింత నిరాశపరచింది. ఈ చిత్రంలో ధనుష్ సరసన కాజల్ కథానాయికగా నటించింది. ఇప్పుడు ఈ సీక్వెల్‌కి మరో కథని బాలాజీ మోహన్ సిద్ధం చేసారట. అంతేకాదు ఆ కథను ధనుష్‌కు వినిపించగా ఈయన కూడా ఓకే చేసేసారట. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని భావిస్తోండగా, ఈ సీక్వెల్ ధనుష్‌కు ఎంతటి సంతృప్తిని మిగులుస్తుందో చూడాలి

2806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles