మారి 2 తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Wed,December 12, 2018 08:31 AM
maari 2 telugu trailer released

రజినీకాంత్ అల్లుడిగా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయిన ధ‌నుష్‌ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, సింగ‌ర్ ఇలా మ‌ల్టీ టాలెంట్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు . తాజాగా మారి 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు ధ‌నుష్‌. ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. ఇటీవ‌ల చిత్ర త‌మిళ వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ధ‌నుష్ లుక్ అదిరిపోయింది. స‌న్నివేశాలు త‌మీళ తంబీల‌కి మంచి వినోదాన్ని అందించాయి. ఇక తాజాగా తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇది అభిమానులని ఆక‌ట్టుకునేలా ఉంది. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలాజీ మోహన్ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెర‌కెక్కింది.

ధనుష్ గతంలో చేసిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ మారి . డిఫరెంట్ యాంగిల్ లో ఊర మాస్ పాత్రలో ధనుష్ చేసిన మారి 1 సినిమా ఓ వర్గం వారిని బాగా ఆకట్టుకుంది. తెలుగులో మాస్ గా రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్ప‌డు సీక్వెల్ తెలుగులో మారి 2 తో విడుద‌ల అయింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. . ఆయ‌న సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుద‌ల అవుతుంది.

1382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles