వ‌న‌భోజ‌నాల‌లో మూవీ ఆర్టిస్టుల సంద‌డి

Tue,December 3, 2019 01:21 PM

ప్ర‌తి రోజు షూటింగుల‌తో బిజీగా ఉండే ఆర్టిస్టులు కాస్త ఉప‌శ‌మ‌నం కోసం వ‌నభోజ‌నాల‌కి వెళ్ళారు. మా ఉపాధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవిత రాజశేఖ‌ర్ నేతృత్వంలో ఈ కార్య‌క్ర‌మం హైటెక్ సిటీలోని టీఎస్ఐసీసీ పార్క్‌లో ఘ‌నంగా జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి మా స‌భ్యుల‌తో పాటు టీవీ, సినిమా రంగానికి చెందిన న‌టీన‌టులు హాజ‌ర‌య్యారు. ఆట‌పాట‌ల‌తో సంద‌డిగా సాగిన ఈ కార్య‌క్ర‌మంలో అలీ, కార్తికేయ‌, గిరిబాబు, రాజా ర‌వీంద్ర‌, మంగ్లీ, శివారెడ్డి తదిత‌రులు సంద‌డి చేశారు. ఇక ఇదే కార్య‌క్ర‌మంలో ఇటీవ‌ల దారుణ హ‌త్య‌కి గురైన వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ దిశాకి శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చర్య‌లు చేప‌ట్టాల‌ని వారు కోరారు.

3271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles