‘మా’ అభిమానులకు కృతజ్ఞతలు: నరేశ్‌

Mon,March 11, 2019 03:08 PM
Maa president Naresh thanks For his panel victory


హైదరాబాద్‌ : మూవీ ఆర్టీస్ట్‌ అసోసియేషన్‌ (మా)ఎన్నికల్లో తమ గెలుపునకు కృషి చేసిన సభ్యులకు, సోదరసోదరీమణులకు మా అధ్యక్షునిగా ఎన్నికైన నరేశ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. మా ఎన్నికల్లో నరేశ్‌ ప్యానెల్‌ విజయం సాధించిన సందర్భంగా..నరేశ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రతీ క్షణం నా వెంట ఉండి నాతో కలిసి పనిచేసిన ప్రతీ ఒక్క కార్యకర్తకు, పూర్తి సహకారం అందించిన మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను అడిగిన వెంటనే నీవెంట నేనుంటాను అన్నయ్యా అని వచ్చిన సోదరి జీవితకు, నా అభిమానులు, మా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు నరేశ్‌.

మొదటిసారి ఎన్నికల ఓటింగ్‌ పద్దతిలో గెలిచాం. ఇవాళ చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఇక్కడ ఇంకో హీరో శ్రీకాంత్‌ ఉన్నారు. ఆయనకు అందరితో బాగా పరిచయం ఉంది. నేను ఎప్పుడో ఒకసారి కనిపిస్తాను. నాకు ఓటు వేస్తారా..ఆయనకు ఓటు వేస్తారా అని ఉండేది. సభ్యులంతా మమ్మల్ని గెలిపించారు. -ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, రాజశేఖర్‌

నేను ఎన్నికల్లో దిగడానికి కారణమేంటంటే..మూవీ ఆర్టీస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు అంటే ఏదో పది మంది మధ్యలో జరుగుతుంది. అలా కాకుండా ప్రతీ ఒక్కరూ రావాలి. ఓటింగ్‌లో పాల్గొనాలి. ఓటు అనేది మన హక్కు. ఓటు వేసి బలమైన ప్యానెల్‌ను గెలిపిస్తే..మన సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. దూరప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటు వేసి..మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. మా చరిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద స్థాయిలో ఓటింగ్‌ శాతం నమోదు కాలేదు. సుమారు 500 మంది వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు.- జనరల్ సెక్రటరీ, జీవితారాజశేఖర్‌

కొత్తగా ఏర్పడిన ప్యానెల్‌లో ట్రెజరర్‌ (కోశాధికారి)గా నేను అడిగినా..అడక్కపోయినా నాకు ఓటేసిన ప్రతీ ఒక్కరికీ..ఈ ప్యానెల్‌ సభ్యులందరికీ ధన్యవాదాలు. ట్రెజరర్‌గా మా కు సంబంధించిన ప్రతీ లెక్కను సమర్థవంతంగా చూస్తానని అధ్యక్షుడి సమక్షంలో తెలియజేస్తున్నా. -కోశాధికారి-రాజీవ్ కనకాల

2120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles