సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ పా రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కాలా. మురికివాడల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీ అయింది. ఏప్రిల్ 27న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు మేకర్స్. కాని కొద్ది రోజులుగా కోలీవుడ్ లో జరుగుతున్న బంద్ కారణంగా కాలా సినిమా రిలీజ్ డేట్ మారిందని పుకార్లు షికారు చేశాయి. మొదట సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలని ముందుగా విడుదల చేయాలని టీఎఫ్ పీసీ భావించిన నేపథ్యంలో కాలా రిలీజ్ డేట్ కాస్త ముందుకి వెళ్లిందని తమిళ మీడియా చెప్పుకొచ్చింది. ఈ వార్తలు లైకా సంస్థకి చేరడంతో వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు. కాలా రిలీజ్ డేట్ విషయంలో లైకా సంస్థ ఎవరితో ఎలాంటి చర్చలు జరపలేదు. కాలా రిలీజ్ డేట్ విషయంలో వస్తున్న వార్తలకి, మాకు ఎలాంటి సంబంధం లేదని లైకా ప్రొడక్షన్ సంస్థ తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అంటే కాలా సినిమా తెలుగు, తమిళ భాషలలో ఏప్రిల్ 27న గ్రాండ్ గా విడుదల కానుంది.