లూసిఫ‌ర్ సీక్వెల్‌కి టైటిల్ ఫిక్స్ చేసిన యూనిట్

Wed,June 19, 2019 08:14 AM
Lucifer sequel title fixed

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రం 'లూసిఫర్'. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా 'లూసిఫర్' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. విడుదలైన 8 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు మేక‌ర్స్. ఎంపురాన్ అనే టైటిల్‌తో సీక్వెల్ తెర‌కెక్క‌నుందంటూ టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. సీక్వెల్ కూడా పృధ్విరాజ్ సుకుమారన్ ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబ‌వార్ నిర్మించ‌నున్నారు. ముర‌ళీ గోపి చిత్రానికి ర‌చ‌యిత‌గా ప‌నిచేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ తెలిపారు. లూసిఫ‌ర్ చిత్రం 100 కోట్ల క్లబ్ లోకి చేరిన మూడో మళయాళ చిత్రంగా కాగా, గ‌తంలో మోహన్ లాల్ నటించిన పులిమురుగన్ 100 కోట్ల క్లబ్ లోకి చేరిన తొలి చిత్రంగా నిలిచింది. నివిన్ పాలీ నటించిన కాయంకులం కోచున్ని రెండో చిత్రంగా నిలిచింది. లూసిఫ‌ర్ సీక్వెల్ కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని టీం విశ్వ‌సిస్తుంది.

967
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles