లూసిఫ‌ర్ ట్రైల‌ర్‌తో అల‌రిస్తున్న మ‌ల‌యాళ మెగాస్టార్

Thu,March 21, 2019 09:09 AM

మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్‌లాల్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కి అన్ని భాష‌ల‌లో మంచి ఆద‌ర‌ణ ఉంది. ఆయన ఎంచుకునే విభిన్నమైన కథలు ప్రేక్షకులను ఎప్పుడూ థ్రిల్ కు గురి చేస్తూనే ఉంటాయి. ఆ మ‌ధ్య 'ఒడియన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోహ‌న్‌లాల్ ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని థ్రిల్ చేశాడు. ఇక మోహ‌న్ లాల్ న‌టించిన పులి జూదం చిత్రం నేడు తెలుగులో విడుద‌ల కానుంది.


మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ లూసిఫర్. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఆంటోనీ నిర్మిస్తున్నారు. మోహన్ లాల్ సరసన మంజూ వారియర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో వివేక్ ఒబెరాయ్ కన్పిస్తుండగా… దీపక్ సంగీతాన్ని సమకూర్చారు. చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ చిత్రం పొలిటిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. స‌న్నివేశాలు చిత్రంపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. మోహ‌న్ లాల్ లుక్ అదిరిపోయింది. మ‌రి మీరు ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి.

1026
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles