సినిమాకు డిమాండ్ పెరగడానికి కారణమిదే..

Tue,February 12, 2019 10:39 PM

ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ అబ్దుల్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఒరు అదార్ లవ్. తెలుగులో లవర్స్ డే పేరుతో ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలవుతుంది. ఈ చిత్రం ఆడియో వేడుకకు అల్లు అర్జున్ హాజరైన విషయం తెలిసిందే. బన్నీ ముఖ్య అతిథిగా రావడం వల్లే సినిమాకు డిమాండ్ మరింత పెరిగిందంటున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన వినోద్ రెడ్డి మాట్లాడుతూ..మా సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకకు వచ్చిన అల్లు అర్జున్ కు ధన్యవాదాలు చెప్పాలి. బన్నీ ఈ వేడుకకు రావడం వల్ల మా సినిమాకు డిమాండ్ మరింత పెరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2వేల థియేటర్లలో విడుదల కాబోతుంది. తెలుగులో 600 థియేటర్లలో విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించాడు.

3755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles