స‌ల్మాన్ బావ న‌టించిన 'ల‌వ్ రాత్రి' ట్రైల‌ర్ విడుద‌ల‌

Tue,August 7, 2018 09:10 AM
Loveratri trailer released

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఒక వైపు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తూ మ‌రోవైపు త‌న ప్రొడ‌క్ష‌న్‌లో వైవిధ్య‌మైన సినిమాలు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే . ప్ర‌స్తుతం భార‌త్ చిత్రం చేస్తున్న స‌ల్మాన్ త‌న సొంత ప్రొడ‌క్ష‌న్ స‌ల్మాన్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్ హూజ్‌లో ల‌వ్‌రాత్రి అనే సినిమా రూపొందిస్తున్నాడు. స‌ల్మాన్ చెల్లెలి భ‌ర్త ఆయుశ్ శ‌ర్మ ఈ చిత్రంతో హీరోగా వెండితెర ఆరంగేట్రం చేస్తుండ‌గా, వ‌రీనా హుస్సేన్ ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అక్టోబ‌ర్ 5న చిత్ర విడుద‌ల‌కి ప్లాన్ చేసారు. రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న‌ ల‌వ్‌రాత్రి చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో సన్నివేశాలు అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి.

న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా గుజ‌రాతీ సంప్ర‌దాయ గ‌ర్భ నృత్యం చేస్తున్న అమ్మాయిని చూసి హీరో మ‌న‌సు ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు ద‌గ్గ‌ర‌వుతారు. అమ్మాయి ఇండియా వ‌దిలి విదేశాల‌కి వెళ్లిపోవ‌డంతో హీరో ఆమె ప్రేమ‌ని పొంద‌డానికి విదేశాల‌కి వెళ‌తాడు. అక్కడ ఆమెను, ఆమె తండ్రిని హీరో మెప్పిస్తాడా లేదా వారి ప్రేమకు ఎదురైన ఆటంకాలేమిటీ? చివరికి వారు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు తదితర సన్నివేశాలతో ఈ ట్రైలర్ రూపొందించారు. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమా ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని అర్ద‌మ‌వుతుంది. అయితే ఈ సినిమా టైటిల్ హిందూ ఫెస్టివ‌ల్ న‌వ‌రాత్రికి ద‌గ్గ‌రగా ఉందని, ఇది హిందూ మ‌నోభావాల‌ని దెబ్బ తీసేలా ఉంద‌ని విశ్వ హిందూ పరిష‌త్ ఆరోపించింది. ల‌వ్‌రాత్రి టైటిల్‌తో మూవీని ఇండియాలో రిలీజ్ కానివ్వ‌మ‌ని వారు అంటున్నారు. మ‌రి అభిరాజ్ మినవాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ రొమాంటిక్ డ్రామా ల‌వ్‌రాత్రి అదే పేరుతో విడుద‌ల అవుతుందా, లేదంటే కొత్త పేరుతో సినిమాని విడుద‌ల చేస్తారా అనేది చూడాలి.

2287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles