త‌న సినిమా టైటిల్ మార్చిన సల్మాన్ ఖాన్‌

Wed,September 19, 2018 11:23 AM
Loveratri title changed

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఒక వైపు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తూ మ‌రోవైపు త‌న ప్రొడ‌క్ష‌న్‌లో వైవిధ్య‌మైన సినిమాలు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే . ప్ర‌స్తుతం భార‌త్ చిత్రం చేస్తున్న స‌ల్మాన్ త‌న సొంత ప్రొడ‌క్ష‌న్ స‌ల్మాన్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్ హూజ్‌లో ల‌వ్‌రాత్రి అనే సినిమా రూపొందిస్తున్నాడు. స‌ల్మాన్ చెల్లెలి భ‌ర్త ఆయుశ్ శ‌ర్మ ఈ చిత్రంతో హీరోగా వెండితెర ఆరంగేట్రం చేస్తుండ‌గా, వ‌రీనా హుస్సేన్ ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అక్టోబ‌ర్ 5న చిత్ర విడుద‌ల‌కి ప్లాన్ చేసారు. కాని ఇటీవ‌ల‌ ఈ మూవీ టైటిల్ వివాదంలో చిక్కుకుంది. రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కిన‌ ల‌వ్‌రాత్రి చిత్ర‌ టైటిల్ హిందూ ఫెస్టివ‌ల్ న‌వ‌రాత్రికి ద‌గ్గ‌రగా ఉందని, ఇది హిందూ మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచే విధంగా ఉందంటూ, వెంట‌నే ఆ టైటిల్ మార్చాలని విశ్వ హిందూ ప‌రిష‌త్ డిమాండ్ చేసింది.

నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాగే ల‌వ్ రాత్రి చిత్రంలో పండుగ తొమ్మిది రోజుల్లో ఓ యువ జంట మధ్య చిగురించే ప్రేమను ల‌వ్ రాత్రి చిత్రంలో చూపించ‌నున్నార‌ట‌. ల‌వ్ రాత్రి అనే పేరు హిందువులు ప‌విత్రంగా భావించే న‌వ‌రాత్రి పండుగ‌కి ద‌గ్గ‌రగా ఉంది. ఈ పేరుతో హిందూ మ‌నోభావాల‌ని దెబ్బ తీస్తున్నారు. సినిమాని ఇండియాలో రిలీజ్ కానిచ్చే ప్ర‌స‌క్తే లేదు అని విశ్వ హిందూ ప‌రిష‌త్ వారు అప్ప‌ట్లో డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ టైటిల్ పెట్ట‌డం వ‌ల‌న చిత్ర బృందంపై ప‌లు కేసులు న‌మోదు అయ్యాయి. ఈ క్ర‌మంలో స‌ల్మాన్ ఈ సినిమా పేరుని ల‌వ్ యాత్రిగా మార్చి పోస్ట‌ర్ ని ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశాడు. అంతేకాదు ఈ పోస్ట‌ర్ కామెంట్‌గా ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కాదని తెలిపాడు స‌ల్మాన్‌. అభిరాజ్ మినవాల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే .


996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles