ల‌వ‌ర్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Sun,July 15, 2018 08:29 AM
Lover Theatrical Trailer releasd

రాజ్ త‌రుణ్‌, రిద్ది కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీష్ కృష్ణ తెర‌కెక్కించిన చిత్రం ల‌వ‌ర్‌. జూలై 20న విడుద‌ల కానున్న ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న సాయంత్రం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ల‌వ్‌, ఎమోష‌న‌ల్ డ్రామాగా ల‌వర్ చిత్రం తెర‌కెక్కి ఉంటుంద‌ని ట్రైల‌ర్‌ని చూస్తుంటే అర్ధ‌మవుతుంది. ఇప్పటికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ట్రైల‌ర్ కూడా అల‌రిస్తుంది. చిత్ర రిలీజ్‌కి మ‌రో నాలుగు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు ల‌వ‌ర్ మేక‌ర్స్‌. చిత్రంలో పిల‌క‌తో స‌రికొత్త‌గా క‌నిపించాడు రాజ్ త‌రుణ్ . ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అంకిత్ తివారీ, రిషీ రిచ్‌చ ఆర్కో, త‌నిష్క్ బ‌గ్చీలు సాయి కార్తీక్‌తో క‌లిసి సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని మెప్పించేలా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS