నా ప్రేమ విశ్వ‌మంత‌.. త‌ప్పించుకోలేవు

Sat,June 30, 2018 09:05 AM
Lover Teaser released

కెరీర్ మొద‌టి నుండి వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల మెప్పు పొందుతున్న యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌. ప్ర‌స్తుతం డెబ్యూ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవ‌ల‌ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇందులో పిల‌క‌తో స‌రికొత్త‌గా క‌నిపించాడు రాజ్ త‌రుణ్ . రిద్ధి కుమార్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అంకిత్ తివారీ, రిషీ రిచ్‌చ ఆర్కో, త‌నిష్క్ బ‌గ్చీలు సాయి కార్తీక్‌తో క‌లిసి సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని మెప్పించేలా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. జూలై 14న మూవీ విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో సన్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. నా ప్రేమ విశ్వ‌మంత‌.. నా నుండి నువ్వు తప్పించుకోలేవు అనే డైలాగ్ అభిమానుల‌కి బాగా కనెక్ట్ అయింది. మ‌రి ఈ టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.


2110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles