రాజ్ త‌రుణ్ గెట‌ప్ ఈ సారి కొత్త‌గా ఉందే..!

Sat,June 16, 2018 10:47 AM
Lover Motion Poster released

కెరీర్ మొద‌టి నుండి వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల మెప్పు పొందుతున్న యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌. ప్ర‌స్తుతం డెబ్యూ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ రివీల్ చేశారు. ఇందులో పిల‌క‌తో రాజ్ త‌రుణ్ గెట‌ప్ స‌రికొత్త‌గా ఉంది. రిద్ధి కుమార్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అంకిత్ తివారీ, రిషీ రిచ్‌చ ఆర్కో, త‌నిష్క్ బ‌గ్చీలు సాయి కార్తీక్‌తో క‌లిసి సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని మెప్పించేలా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. అతి త్వ‌ర‌లోనే టీజ‌ర్‌, ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేస్తార‌ట‌. వ‌చ్చే నెల 14వ తేదీన ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి తాజాగా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

2275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles