పెళ్లిపై నోరు విప్పిన క‌త్రినా కైఫ్‌

Thu,December 6, 2018 11:10 AM
Love will come to me at the right time says katrina

బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం పెళ్ళిళ్ళ సీజ‌న్ నడుస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌గా ఉన్న వారంద‌రు ఒక్కొక్క‌రుగా పెళ్ళి పీట‌లెక్కుతున్నారు. న‌వంబర్‌లో దీపికా ప‌దుకొణే, ర‌ణ్‌వీర్ సింగ్‌లు వివాహం చేసుకోగా, డిసెంబ‌ర్‌లో నిక్ జోనాస్‌, ప్రియాంక చోప్రాలు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. డిసెంబ‌ర్ 13న శ్వేతా బసు చిన్న చిత్రాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్ ఒక్క‌టి కానున్నారు. ఇక రాఖీ సావంత్ కూడా ఈ డిసెంబ‌ర్‌లోనే వివాహం చేసుకోనుంది. ఈ నేప‌థ్యంలో క‌త్రినా కైఫ్ తన పెళ్లి, పిల్లల ఆలనాపాలన గురించి తన మనసులోని మాటను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. కొద్ది రోజులుగా నా మ‌న‌సులో కూడా పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌స్తుంది. దీనిని భ‌గ‌వంతుడికే వదిలేసాను. జీవితంలో మ‌న‌కు ఏది రాసి ఉంటే అది జ‌రుగుతుంది. అందుకే శాంతంగా ఉండ‌గ‌లుగుతున్నాను. మ‌న‌కు వ‌చ్చే అన్నీ ఆలోచ‌న‌లు సాకారం కావు అంటూ క‌త్రినా పేర్కొంది. ఈ అమ్మడు ర‌ణ్‌బీర్‌తో కొన్నాళ్లు ప్రేమాయ‌ణంలో ఉండ‌గా, 2016లో వీరి ల‌వ్‌కి పులిస్టాప్ ప‌డింది. రణ్‌బీర్ ప్ర‌స్తుతం అలియా భ‌ట్‌తో ప్రేమాయ‌ణంలో ఉన్నాడు. త్వ‌ర‌లో విరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం క‌త్రినా భార‌త్ అనే సినిమాలో స‌ల్మాన్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

3589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS