నాని,ఇమ్మానుయేల్, ప్రియాశ్రీ ప్రధాన పాత్రలుగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై ‘ఉయ్యాలా జంపాలా’ ఫేమ్ విరించి వర్మ తెరకెక్కించిన చిత్రం ‘మజ్ను’. వెరైటీ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న గ్రాండ్ గా విడుదల కానుండగా నాని ఈ చిత్రంతో మరో హిట్ ని కొట్టడం ఖాయమని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ‘మజ్ను’ యూనిట్ వినూత్న ప్రచారాలు చేస్తోంది. తాజాగా నాని మజ్ఞుకి సంబంధించి లవ్ పాఠాలు చెబుతున్నాడు. అందుకు సంబంధించి ఓ వీడియోని కూడా పోస్ట్ చేశాడు. మరి మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.