పవన్-త్రివిక్రమ్ మూవీతో రీఎంట్రీ..!

Sun,December 3, 2017 01:17 PM
Lissy to comeback with pawan-trivikram movie

హైదరాబాద్ : పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో అజ్ఞాతవాసి చిత్రం సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. పవన్-త్రివిక్రమ్ సహనిర్మాణంలో కృష్ణచైతన్య డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో నితిన్, మేఘా హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఈ ప్రాజెక్టులో అలనాటి అందాల తార లిజీ కీలక పాత్రలో నటించనుందట. మగాడు, 20వ శతాబ్దంతోపాటు పలు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి పాపులర్‌గా నటిగా పేరు తెచ్చుకున్న లిజీ..పవన్-త్రివిక్రమ్ మూవీతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన లిజీ ఈ సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించాలని ఫిక్సయినట్లు సమాచారం.

6395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles