వ‌ణుకు పుట్టించే ట్రైల‌ర్

Wed,November 21, 2018 01:09 PM
Lisaa 3D Official Teaser released

తెలుగింటి సీత‌మ్మ అంజ‌లి ప్ర‌స్తుతం రాజు విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లిసా అనే చిత్రం చేస్తుంది. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఏక‌కాలంలో తెర‌కెక్కుతుంది. ఇటీవ‌ల ఈ చిత్ర పోస్ట‌ర్, టీజ‌ర్‌ విడుద‌ల కాగా, ఇందులో అంజ‌లి లుక్ భ‌య‌పెట్టించేదిగా ఉంది. గీతాంజ‌లి త‌ర్వాత మ‌రో హ‌ర్రర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించ‌నుంది అంజ‌లి. పీజీ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేశంలోనే మొదటి సారిగా స్టీరియోస్కోపిక్ 3డీ ఫార్మాట్‌లో రూపొందుతున్న హార్రర్ పిక్చర్ ఇదే కావడం విశేషం. కాగా ఈ సినిమాను హీలియం 8కె కెమెరాతో చిత్రీకరించారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హైద‌రాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటంది. బ్రహ్మానందం, మార్కండ్ దేశ్‌పాండే తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రం హ‌ర్ర‌ర్ అండ్ థ్రిల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. సంతోష్ దయానిధి సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్ర తమిళ్ ట్రైలర్ రిలీజ్ అయింది. దీనిని ట్విటర్‌లో పోస్ట్ చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ‘వణకు పుట్టించే ట్రైలర్ 3డీ లిసాను చూడండి’ అంటూ ట్వీట్ చేసారు. ట్రైల‌ర్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. మ‌రి ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

4953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles