మ‌రోసారి భ‌య‌పెట్టిస్తున్న అంజ‌లి

Sat,November 17, 2018 10:03 AM
Lisaa 3D  Official Teaser released

తెలుగింటి సీత‌మ్మ‌గా టాలీవుడ్ ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాలు అందుకున్న అంజ‌లి ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేస్తుంది. తాజాగా రాజు విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లిసా అనే చిత్రం చేస్తుంది. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఏక‌కాలంలో తెర‌కెక్కుతుంది. ఇటీవ‌ల ఈ చిత్ర పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇందులో అంజ‌లి లుక్ భ‌య‌పెట్టించేదిగా ఉంది. గీతాంజ‌లి త‌ర్వాత మ‌రో హ‌ర్రర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించ‌నుంది అంజ‌లి. పీజీ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేశంలోనే మొదటి సారిగా స్టీరియోస్కోపిక్ 3డీ ఫార్మాట్‌లో రూపొందుతున్న హార్రర్ పిక్చర్ ఇదే కావడం విశేషం. కాగా ఈ సినిమాను హీలియం 8కె కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా చిత్ర టీజర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త థ్రిల్‌ని క‌లిగిస్తున్నాయి. మీరు టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.

1790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles