‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు లైన్ క్లియర్

Mon,March 25, 2019 06:00 PM

గత కొన్ని రోజులుగా వివాదాల్లో చిక్కుకున్న వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 29న ఈ మూవీ విడుదల కానుంది. సినిమాలో ఉన్న సీన్లు, డైలాగ్స్ ఎన్నికల కోడ్ పరిమితికి లోబడే ఉన్నట్లు జారీ అయిన మానిటరింగ్ కమిటీ మీడియా సర్టిఫికేషన్ ను నిర్మాత రాకేశ్ రెడ్డి ఈసీకి సమర్పించారు.


సినిమా కథనం గురించి ఈసీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాం. సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా..ఈసీ ఎదుట హాజరవ్వాలని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎవరిని తక్కువచేసి చూపించడం లేదని, ఎన్టీఆర్ జీవితం చివరి దశలో జరిగిన విషయాలను చెప్పేందుకే ఈ సినిమా చేశామని ఈసీకి చెప్పినట్లు నిర్మాత రాకేశ్ రెడ్డి వెల్లడించారు. ఈ చిత్రం లక్ష్మీపార్వతి రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించినట్లు చెప్పారు.

4748
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles