యాక్ష‌న్ సినిమా కోసం తొలిసారి పాట పాడిన‌ రానా

Thu,November 14, 2019 12:17 PM

బాహుబ‌లి చిత్రంతో దేశ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందిన రానా ప్ర‌స్తుతం విరాట‌ప‌ర్వం చిత్రంతో పాటు వేరే ప్రాజెక్టులలో న‌టిస్తున్నాడు. నిర్మాత‌గాను మంచి సినిమాలు రూపొందించాల‌ని భావిస్తున్నాడు. అయితే తొలి సారి విశాల్ న‌టిస్తున్న యాక్ష‌న్ సినిమా కోసం త‌న గొంతు స‌వ‌రించుకున్నాడు రానా. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు హిప్ హాప్ తమీజాతో క‌లిసి లైట్స్ కెమెరా యాక్ష‌న్ అనే సాంగ్ పాడారు. నిన్న ఆ సాంగ్‌కి సంబంధించిన‌ ప్రోమో వీడియో విడుద‌ల చేసిన టీం కొద్ది సేప‌టి క్రితం ఫుల్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాల‌కి రానా గ‌ళం తోడైంది. ఈ వీడియో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ సినిమా తెర‌కెక్క‌గా రేపు ఈ మూవీ గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించింది. యోగిబాబు, ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు

815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles