కోట శ్రీనివాసరావుకు జీవన సాఫల్య పురస్కారం

Sun,November 11, 2018 06:45 AM
lifetime achievement award to actor Kota Srinivasa Rao

హైదరాబాద్: ఢిల్లీ తెలుగు అకాడమీ 30వ వార్షికోత్సవం శనివారం బషీర్‌బాగ్‌లోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుకు జీవన సాఫల్య పురస్కారాన్ని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అందజేసి ఘనంగా సత్కరించారు. ఉద్యోగరత్న అవార్డుతో ఎఫ్‌ఎసిసిఐ సెక్రటరీ జనరల్ సంజయ్‌కపూర్‌ను, ప్రతిభా పురస్కారంతో విద్యావేత్తలు డి.ఎన్.ప్రసాద్, భారతిప్రసాద్ దంపతులను, టీవీ నటుడు నందకిశోర్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ సత్కరించారు. పురస్కార గ్రహీతలు మరింత కృషితో సమాజానికి ఆదర్శంగా ఉంటూ మంచి పనులు చేసి ఆదర్శంగా ఉండాలని జస్టిస్ శివశంకర్ సూచించారు. విశ్రాంత ఐఏఎస్ మోహన్‌కందా,టీవీ నటులు సుబ్బరాయశర్మ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లిటిల్ మ్యూజిషియన్ సంచాలకులు రామాచారి శిష్య బృం దం ఆలపించిన పాటలు సంగీతప్రియులను అలరించారు.

1490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles