మ‌ణిర‌త్నంకి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

Sat,February 24, 2018 11:06 AM
lifetime achievement award for Mani Ratnam

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో మ‌ణిర‌త్నం ఒక‌రు. మేలిమి ముత్యాల్లాంటి సినిమాల‌ని తీసిన మ‌ణిర‌త్నంకి బెంగ‌ళూర్ ఫిలిం ఫెస్టివ‌ల్‌(బిఐఎఫ్ఎఫ్‌)లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో స‌త్క‌రించ‌నుంది. ప‌ది ల‌క్ష‌ల న‌గ‌దు, ప్ర‌శంసా ప‌త్రంతో పాటు మోమెంటోని అందించనున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌కి అందించిన సేవ‌ల‌కి గాను ఓ ఫిలింమేక‌ర్‌కి బిఐఎఫ్ఎఫ్.. అవార్డు అందించ‌డం ఇదే తొలిసారి. 13మంది స‌భ్యులు గ‌ల క‌మిటీ మ‌ణిర‌త్నం పేరుని ఎంపిక చేసింది. అవార్డుని బిఐఎఫ్ఎఫ్ క్లోజింగ్ సెర్మ‌నీ రోజు( మార్చి 1)న మ‌ణిర‌త్నంకి అందించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ముఖ్య అతిధిగా హాజ‌రు కానుండ‌గా, ఆయ‌న చేతుల మీదుగా మ‌ణిర‌త్నం ఈ అవార్డు అందుకోనున్నారు. క‌న్న‌డ చిత్రం ప‌ల్ల‌వి అనుప‌ల్ల‌వితో డెబ్యూ ఇచ్చిన మ‌ణిశ‌ర్మ సౌత్ ప‌రిశ్ర‌మ గ‌ర్వించ‌ద‌గ్గ సినిమాలు చేశాడు. కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాకుండా స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే అత్య‌ద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కించాడు. న‌య‌గ‌న్‌, బొంబాయి, ఇరువ‌ర్ త‌దిత‌ర చిత్రాలు రియ‌ల్ ఇన్సిడెంట్స్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ద‌ళ‌ప‌తి, రావ‌న్ చిత్రాలు ఇండియ‌న్ ఎపిక్స్ ఆధారంగా తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం ఓ మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడు మ‌ణిర‌త్నం. న‌వాబ్ అనే టైటిల్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, అదితి రావు హైద‌రి, డ‌యానా ఎర‌ప్పా, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నాడు.

576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles