లెజండ‌రీ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

Tue,April 2, 2019 09:02 AM
Legendary Tamil Film Director Mahendran passed away

ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు జె మ‌హేంద్ర‌న్(79) స్వ‌ర్గ‌స్తులైనారు . అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న కొద్ది రోజులుగా అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న క‌న్నుమూశారు . ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న‌యుడు జాన్ మ‌హేంద్ర‌న్‌ ధృవీక‌రించారు. త‌మిళంలో అనేక హిట్ చిత్రాల‌ని తెర‌కెక్కించారు మ‌హేంద్ర‌న్‌. ముల్లుమ్ మ‌ల‌రుమ్‌, జానీ, నెంజ‌తై కిల్లాడే మ‌హేంద్ర‌న్‌కి ఎంత‌గానో పేరు తెచ్చిపెట్టాయి. న‌టుడిగాను ప‌లు చిత్రాలలో న‌టించిన ఆయ‌న రీసెంట్‌గా విజ‌య్ సేతుప‌తి సీతాకాతి, ర‌జ‌నీకాంత్ పేటా , బ్యూమ్రాంగ్ వంటి చిత్రాల‌లో క‌నిపించారు. 2018లో ఆయ‌న లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ షాక్‌కి గుర‌యింది. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు జ‌ర‌గ‌నున్నాయి.


4669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles