కామెడీ లెజెండ్ క్రేజీ మోహన్ కన్నుమూత

Mon,June 10, 2019 06:31 PM
Legend comedian Crazy Mohan passesaway


చెన్నై: ప్రముఖ తమిళ రచయిత, కమెడియన్ క్రేజీ మోహన్ కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం క్రేజీ మోహన్ కు గుండెపోటు రావడంతో ఆయనను చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు డాక్లరు వెల్లడించారు.

గిండిలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు క్రేజీ మోహన్. ఆయన ఇంజినీరింగ్ విద్యార్థిగా ఉంటూనే స్రిఫ్ట్ రైటర్ గా పనిచేశారు. క్రేజీ మోహన్ కే బాలచందర్ దర్వకత్వంలో వచ్చిన పొయిక్కల్ కుధిరై చిత్రానికి తొలిసారిగా సంభాషణలు రాశారు. కమల్ హాసన్ తో కలిసి మైఖేల్ మదన కామరాజు, సతీలీలావతి, తెనాలి, పంచతంత్రం వంటి హిట్ చిత్రాల్లో తన హాస్యంతో అందరిని కడుపుబ్బా నవ్వించారు క్రేజీ మోహన్. వీటితోపాటు తమిళంలో చాలా ప్రాచుర్యం పొందిన ఎన్నో నాటకాలకు సంభాషణలు రాయడమే కాకుండా..నటించారు కూడా.

3210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles