తల 57వ మూవీ పిక్స్ లీక్డ్

Wed,January 11, 2017 01:05 PM

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీని తెగ ఇబ్బంది పడుతున్న సమస్య లీకేజ్. భారీ సినిమాలనే టార్గెట్ చేసుకొని ఈ లీకేజ్ లు జరుగుతున్నాయి. ఒక్క ఇండస్ట్రీనే కాకుండా అన్ని భాషల సినిమాలకు ఈ లీకేజ్ బెడద పట్టుకుంది. తాజాగా అజిత్ 57 వ చిత్రం కు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పవర్ ఫుల్ వెపన్స్ పట్టుకొని కొంత మంది గ్రూప్ దాడికి దిగినట్టు ఈ ఫోటోలలలో కనిపిస్తోంది. ఎంత జాగ్రత్తలు తీసుకున్న ఇలాంటి లీకులు జరుగుతుండడంతో నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు.

తల 57 చిత్రంలో అజిత్ ఇంటర్‌పోల్‌ అధికారిగా కనిపించనున్నాడని , మొన్నటి వరకు బల్గేరియాలో చిత్రీకరణ జరుపుకున్న యూనిట్ తాజాగా చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటి వరకు ఈ చిత్ర బడ్జెట్ దాదాపు 100 కోట్లు దాటిందని కోలీవుడ్ మీడియా చెబుతోంది. వీరం, వేదాళం చిత్రాలను తెరకెక్కించిన శివన్ తల 57 చిత్రాన్ని అజిత్ అభిమానుల అంచనాలకు మించే విధంగా తీస్తున్నాడు. ఈ చిత్రంలో అజిత్ సరసన కాజల్ , అక్షర హాసన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా రిపబ్లిక్ డేని పురస్కరించుకొని చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోందట.


1057

More News

మరిన్ని వార్తలు...