మ‌ల్టీ స్టార‌ర్‌లో వెంకీ స‌ర‌స‌న శ్రియ‌

Wed,December 12, 2018 01:56 PM
Leading Ladies Of Venky Mama

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తుంది. నాలుగుకి పైగా మ‌ల్టీ స్టార‌ర్స్ సెట్స్ పై ఉండ‌గా, మ‌రో క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. వెంక‌టేష్‌, నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొంద‌నున్న చిత్రం ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకోగా ఈ నెల‌లోనే సెట్స్ పైకి వెళుతుంద‌ని అంటున్నారు. తొలి షెడ్యూల్‌ని చెన్నైలో మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ మ‌ల్టీ స్టార‌ర్‌కి వెంకీ మామ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించనున్నారు. వెంకటేశ్‌కు జోడీగా శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లను పరిశీలిస్తున్నారని ఇటీవ‌ల‌ వార్తలు వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం వెంకీ స‌ర‌స‌న శ్రియ‌నే ఫైన‌ల్ చేశార‌ట‌.

వెంకీ- శ్రియ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సుభాష్ చంద్ర‌బోస్‌, గోపాల గోపాల చిత్రాలు మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. వెంకీ హోమ్ బ్యాన‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు పాపుల‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ సంస్థ అయిన కోన ఫిలిం కార్పొరేష‌న్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నాయి. ప్ర‌స్తుతం వెంకీ .. వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ రోజు వెంకీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సాయంత్రం 5గం.ల‌కి టీజ‌ర్ విడుద‌ల కానుంది. మ‌రి కొద్ది రోజులలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

2440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles