సినిమా చేయకపోవటానికి కారణం చెప్పిన నటి

Mon,February 18, 2019 10:08 PM
laya revealed Why she was rejected ASVR movie

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అరవింద సమేత వీరరాఘవ. ఈ చిత్రంలో పూజాహెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో హీరో తల్లి పాత్ర కోసం త్రివిక్రమ్‌ అలనాటి హీరోయిన్‌ లయను సంప్రదించగా..లయ ఈ ఆఫర్‌ ను తిరస్కరించింది. అరవింద సమేత లో నటించే అవకాశాన్ని వద్దనడానికి కారణం చెప్పింది లయ.

దీనిపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నాది చిన్న వయస్సు కావడంతో..అరవింద సమేత వీరరాఘవ తల్లి పాత్రకు నేను సరిపోదనిపించింది. అందుకే ఆ పాత్రలో నటించలేదు. కానీ సినిమాలో నటించే అవకాశం పోయింది. మంచి పాత్రతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నానని చెప్పింది లయ. రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్‌ లో వచ్చిన అమర్‌ అక్బర్‌ ఆంటోని చిత్రంలో లయ హీరోయిన్‌ (చిన్ననాటి పాత్ర)తల్లి పాత్రలో కనిపించింది.

4968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles