వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల వాయిదా..?

Mon,March 18, 2019 07:16 PM
laxmis NTR Release to postpone ?


రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను సెన్సార్ చిక్కులు వెంటాడుతున్నాయి. సినిమాలోని సన్నివేశాలపై కొంతమంది టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో..ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు సభ్యులు డైలామాలో పడ్డారు.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కు సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. బుధవారం ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లనుండగా..సినిమాను పరిశీలించిన ఆ తర్వాత సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో మార్చి 22న విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్..వారం ఆలస్యంగా విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెన్సార్ సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం మార్చి 29న విడుదలయ్యే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై వర్మ అండ్ టీం నుంచి అధికారిక ప్రకటన వస్తే ఓ స్పష్టత రానుంది.

3991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles