రాయ్‌ల‌క్ష్మీ అత్తిలిపాప సాంగ్ టీజ‌ర్ విడుద‌ల‌

Sat,February 23, 2019 10:22 AM
Laxmi Raais Papa Atthili Papa Song Teaser released

కుర్ర‌కారుని త‌న ఆట‌పాట‌ల‌తో అల‌రించే రాయ్ ల‌క్ష్మీ ఆ మ‌ధ్య తోబా తోబా, ర‌త్తాలు అనే సాంగ్స్‌తో ఓ ఊపు ఊపింది. ప్ర‌స్తుతం కృష్ణ కిషోర్ దర్శకత్వంలో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ అనే చిత్రం చేస్తుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. దీపావ‌ళి కానుక‌గా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన టీం కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన సాంగ్స్‌, ప్రోమోస్ విడుద‌ల చేస్తూ మూవీపై ఆస‌క్తి పెంచుతున్నారు. తాజాగా అత్తిలా పాప అనే సాంగ్ ప్రోమో వీడియో విడుద‌ల చేశారు. సురేష్ బ‌నిశెట్టి లిరిక్స్ ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా హ‌రి గౌర‌, మంగిలి క‌లిసి ఆల‌పించారు. ఈ పాట కుర్ర‌కారుని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం గా కూడా ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, తాజాగా విడుద‌లైన‌ మాస్ సాంగ్‌ను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు . ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని నిర్మాతలు అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తుండగా.. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎబిటి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో ఈ సినిమాని నిర్మాత‌లు గురునాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.

1171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles