ట్రైల‌ర్‌తో సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెంచిన రాయ్ ల‌క్ష్మీ

Wed,February 20, 2019 08:51 AM
Laxmi Raai  Where is The Venkatalakshmi Movie Trailer

ఖైదీ నెం 150 చిత్రంలో ర‌త్తాలు ర‌త్తాలు అంటూ తెలుగు ప్రేక్షకుల‌ని ఓ ఊపు ఊపిన రాయ్ ల‌క్ష్మీ ప్ర‌స్తుతం కృష్ణ కిషోర్ దర్శకత్వంలో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో ఈ సినిమాని నిర్మాత‌లు గురునాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం గా కూడా ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో రాయ్ ల‌క్ష్మీ అందాల‌ని చూపిస్తూ యూత్‌కి మాంచి కిక్కిస్తుంది. టీజ‌ర్‌లో క‌న్నా ట్రైల‌ర్‌లో మాంచి మసాలా ద‌ట్టించి వ‌ద‌ల‌డంతో సినిమాపై ఓ రేంజ్ అంచ‌నాలు పెరిగాయి. ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తుండగా.. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. హ‌రి గౌర చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే 2 నిమిషాల 16 సెకనుల నిడివితో ఉన్న ట్రైలర్‌‌లో లక్షీరాయ్, పూజిత పొన్నాడలు పోటీపడి మరీ అందాలను ఒలకబోయ‌డం విశేషం.

1808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles