బాలీవుడ్‌లో అదృష్టం ప‌రీక్షించుకోబోతున్న లారెన్స్‌

Wed,January 23, 2019 08:23 AM
lawrence bollywood entry with kanchana remake

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్య‌క్తి లారెన్స్‌. కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా సేవా కార్య‌క్ర‌మాల‌తోను అభిమానుల మ‌న‌సులలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ప్ర‌స్తుతం కాంచ‌న సిరీస్‌లో నాలుగో భాగంగా వ‌చ్చిన కాంచ‌న 3 చిత్రాన్ని తెర‌కెక్కించి నిర్మిస్తున్నాడు. వేదిక‌, నిక్కీ తంబోలి, ఓవియా క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఏప్రిల్ 18న విడుద‌ల కానుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న టాలెంట్‌ని సౌత్‌కి ప‌రిచ‌యం చేసిన లారెన్స్ కాంచ‌న చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్ట‌బోతున్నాడు. అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో కాంచ‌న చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నాడ‌ట లారెన్స్. శ‌ర‌త్ కుమార్ పాత్ర కోసం ప‌లువురు ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

1498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles