మరో తమిళ చిత్రంలో లావణ్య త్రిపాఠి

Fri,June 30, 2017 01:40 PM
Lavanya gets another offer in tamil

అందాల రాక్షసి చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి విభిన్న పాత్రలలో నటిస్తూ ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. 2014లో బ్రాహ్మణ్‌ అనే చిత్రంతో తమిళ డెబ్యూ ఇచ్చిన లావణ్య ప్రస్తుతం సివి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాయవన్ చిత్రం చేస్తుంది. ఇందులో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక రీసెంట్ గా మరో తమిళ చిత్రం ఈ అమ్మడి కిట్టీలోకి చేరినట్టు తెలుస్తుంది. తెలుగులో సూపర్ హిట్ కోట్టిన 100% లవ్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇందులో చైతూ పాత్రని జివి ప్రకాశ్‌ కుమార్ చేయనుండగా, తమన్నా పాత్రని లావణ్య త్రిపాఠి లేదంటే హెబ్బాతో చేయించనున్నారని అప్పట్లో టాక్స్ వినిపించాయి. కాని తాజా సమాచారం ప్రకారం లావణ్యని రీమేక్ లో కథానాయికగా ఫైనల్ చేసినట్టు దర్శకుడు ఎం.ఎం. చంద్రమౌళి తెలిపాడు. ఈ సినిమా కోసం లావణ్య పలు కసరత్తులు కూడా చేస్తుందట. త్వరలో సెట్‌ పైకి వెళ్లనున్న ఈ చిత్రం షూటింగ్‌ను 90 శాతం లండన్‌లోనూ మిగిలి 10 శాతాన్ని ఇండియాలో నిర్వహించనున్నట్లు తెలిసింది.

1678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles