సింపుల్ అండ్ స్టైలిష్ గా ల‌వ కుమార్.. జై'ల‌వ‌'కుశ ఫ‌స్ట్ లుక్

Mon,August 7, 2017 10:58 AM
Lava Kumar First Look from junior ntr Jai lava kusa movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం జై లవకుశ. నందమూరి ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండగా ఒక పాత్రలో విలన్ గా, మరొక పాత్రలో ల‌వ కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగిగా, వేరొక పాత్రలో క్లాసికల్ డ్యాన్సర్ గా కనిపించనున్నట్టు కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల నేపథ్యంలో అభిమానులు కూడా తమ హీరోని పలు గెటప్స్ లో ఊహించుకున్నారు. అయితే చిత్ర యూనిట్ ఈ వార్తలని ఖండించింది. విలన్ పాత్రలో జూనియర్ కనిపించడం వాస్తవమే అయినప్పటికి మిగతా రెండు పాత్రలు అవాస్తవమని తేల్చింది. దీంతో ఎన్టీఆర్ మిగతా రెండు పాత్రలపై కాస్త సస్పెన్స్ నెలకొంది. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న జై అనే పాత్ర‌కి సంబంధించిన లుక్ విడుద‌ల చేశారు. ఇందులో సంకెళ్ళ‌తో క‌ట్టివేయ‌బ‌డిన ఎన్టీఆర్ రౌద్రం రాజ‌సం క‌లిసిన లుక్ తో చాలా ప‌వర్ ఫుల్ గా క‌నిపించాడు.

ఇక‌.. ల‌వ కుమార్ పాత్ర కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను ఇవాళ రిల‌జ్ చేసింది మూవీ యూనిట్. సింపుల్ అండ్ స్టైలిష్ గా యంగ్ టైగ‌ర్ ఇచ్చిన పోజు అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్న‌ది. ఈ క్యారెక్ట‌ర్ పై పూర్తి అవ‌గాహ‌న లేన‌ప్ప‌టికీ.. ల‌వ కుమార్ ఎంతో స్టైలిష్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ చూసి ల‌వ కుమార్ పాత్ర పై ఎన్టీఆర్ అభిమానులు భారీగానే అంచ‌నాలు పెట్టుకుంటున్నారు.
3125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS