సైరా చిత్రంకి సంబంధించిన తాజా అప్‌డేట్‌

Fri,February 23, 2018 11:31 AM
latest update of syeraa

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ చిత్రం సైరా. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కేర‌ళ‌లో నేటి నుండి రెండో షెడ్యూల్ జ‌రుపుకోవ‌ల‌సి ఉంది. కాని అనివార్య కార‌ణాల వ‌ల‌న సినిమా షూటింగ్ మార్చి రెండో వారానికి పోస్ట్ పోన్ అయిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుధీప్, న‌య‌న‌తార‌ లాంటి న‌టులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తెలుగు తొలి స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తొలి షెడ్యూల్ చిరంజీవితో పాటు కొన్ని ముఖ్య పాత్ర‌ల‌కి సంబంధించి స‌న్నివేశాలు తెరకెక్కించారు. రెండో షెడ్యూల్‌లో హీరోయిన్ న‌య‌న‌తార‌, బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ పాల్గొన‌నున్నార‌ని టాక్‌. చారిత్ర‌క నేప‌ధ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్‌తో పాటు వెరైటీ కాస్ట్యూమ్స్‌ని కూడా సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. దీపిక‌, ర‌ణ్‌వీర్‌, షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన 'పద్మావత్' కి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసిన చంద్రకాంత్ సొనావెన్ సైరా సినిమాకి పనిచేస్తున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఈ వర్క్ లో భాగం అవుతోంది. కాస్ట్యూమ్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో పరిధిలోని ఎకరం స్థలంలో భారీ షాప్ ను ఏర్పాటు చేసి .. అందులో చిత్రానికి అవ‌స‌ర‌మైన‌ కాస్ట్యూమ్స్ అన్నింటినీ ఉంచుతున్నారని టాక్‌.

2214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles