మ‌రి కొద్ది రోజుల‌లో ప్రారంభం కానున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్

Thu,May 16, 2019 08:28 AM
Latest Update About RRR movie

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దేశ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టి\స్తున్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ షూటింగ్‌లో గాయ‌ప‌డ‌డం వ‌ల‌న చిత్ర షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని మే 21 నుండి జ‌ర‌ప‌నున్నార‌ట‌. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌తో పాటు అలియా భ‌ట్ కూడా షూటింగ్‌లో పాల్గొన‌నుంద‌ని చెబుతున్నారు. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో కొద్ది రోజులు షూటింగ్ జ‌రిపిన త‌ర్వాత చిత్ర బృందం పూణే వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. జూలై 30,2020న ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డీవీవీ దాన‌య్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles