సాహో నుండి స‌రికొత్త పోస్ట‌ర్

Tue,July 23, 2019 09:54 AM
Latest Poster of Saaho Releasing Worldwide on August 30th

టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ సాహో. 2017లో మొద‌లైన చిత్ర షూటింగ్ రీసెంట్‌గా పూర్తైంది. ఆగ‌స్ట్ 30న చిత్రం విడుద‌ల కానుంది. ముందుగా ఆగ‌స్ట్ 15న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావించిన‌ప్ప‌టికి పూర్తి వ‌ర్క్ పూర్తి కాని నేప‌థ్యంలో చిత్రాన్ని వాయిదా వేశారు. క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్టు యూవీ సంస్థ పేర్కొంది. ఇంతక ముందెన్న‌డు చూడ‌ని యాక్ష‌న్ సీన్స్ చిత్రంలో ఉండ‌నున్న‌ట్టు వారు తెలిపారు. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్‌ను దాదాపు రూ.70 కోట్ల వ్యయంతో ఇటీవలే చిత్ర బృందం తెరకెక్కించిందట. ఎనిమిది నిమిషాల నిడివితో కూడిన ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ను అబుదాబిలో ఓ ఎడారి సెట్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దాదాపు 25 నెల‌ల పాటు సాహో కోసం చిత్ర బృందం ప‌ని చేసింది.

చిత్రానికి సంబంధించి విడుద‌లైన మేకింగ్ వీడియోలు, టీజ‌ర్స్ సినిమాపై భారీ ఆస‌క్తిని పెంచాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన రొమాంటిక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌భాస్, శ్ర‌ద్ధాలు ఒక‌రి క‌ళ్ళ‌ల్లో ఒక‌రు రొమాంటిక్‌గా చూసుకుంటున్నారు. ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. సాహో చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం విదిత‌మే.

1141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles