ధ‌నుష్ 'అసుర‌న్' పోస్ట‌ర్ విడుద‌ల‌

Tue,April 30, 2019 08:14 AM
Latest Poster of dhanush Asuran

కోలీవుడ్ హీరో ధ‌నుష్ చివ‌రిగా మారి 2 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే. ఈ చిత్రం పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది . ప్ర‌స్తుతం వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అసుర‌న్ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది వెక్కై అనే నవల ఆధారంగా రూపొందుతున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన టీం తాజాగా మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఇందులో ధ‌నుష్ త‌ల‌పాగా క‌ట్టుకొని, చేతిలో కత్తి ప‌ట్టుకొని ఉన్నాడు. మొహం నిండా రక్త‌పు మ‌ర‌కలు ఉన్నాయి . ధ‌నుష్ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. జీవీ ప్ర‌కాశ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కథానాయిక‌గా మ‌ల‌యాళ భామ మంజు వారియ‌ర్‌ని ఎంపిక చేశారు. ఈ సినిమాకి కలై పులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అసుర‌న్ చిత్రం త‌ర్వాత ధ‌నుష్ స‌త్యజ్యోతి ఫిలింస్‌ సంస్థలో ఓ చిత్రం, యువ దర్శకుడు రామ్‌కుమార్‌ దర్శకత్వంలోనూ ఒక చిత్రం చేయనున్నారు. ఇక బ‌హుబాషా చిత్రంగా ధ‌నుష్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుండ‌గా, ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటు ఎస్‌జే సూర్య‌, అదితిరావు,ధ‌నుష్‌ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్న విష‌యం విదిత‌మే.

1514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles