గాయని లతా మంగేష్కర్‌కు అస్వస్థత

Mon,November 11, 2019 05:31 PM


న్యూఢిల్లీ: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ (90)అస్వస్థతకు లోనయ్యారు. లతామంగేష్కర్‌ కు శ్వాససంబంధ సమస్య రావడంతో ఇవాళ ఉదయం 2 గంటల సమయంలో ఆమెను ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లతామంగేష్కర్‌కు ఐసీయూలో చికిత్స కొనసాగుతుందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. లతా మంగేష్కర్ ఇటీవలే 90వ పడిలోకి అడుగుపెట్టారు. లతామంగేష్కర్ హిందీతోపాటు మరాఠీ, బెంగాలీ ఇతర భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడి..తన గాత్రంతో లక్షలాంది అభిమానులను సంపాదించుకున్నారు. అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ అందుకున్నారు.

782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles