మ‌రింత మెరుగ్గా ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం

Fri,November 15, 2019 01:18 PM

ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో సోమవారం ఆమెని బ్రీచ్‌ క్యాండీ దవాఖానకు తరలించిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న లతామంగేష్కర్‌ ఆరోగ్యం ఇప్పుడు మ‌రింత మెరుగు ప‌డింద‌ని ఆమె అధికార ప్ర‌తినిధి తెలిపారు. మీ ప్రార్ధ‌న‌ల వ‌ల‌న ఆమె చాలా స్పీడ్‌గా రిక‌వ‌ర్ అవుతున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మరోవైపు లత వేగంగా కోలుకోవాలంటూ బాలీవుడ్‌ ప్రముఖులు షబానా అజ్మీ, హేమమాలిని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.




622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles